టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య..మొదటి టెస్ట్ బెంగళూరు వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ మ్యాచ్లో ఒకరోజు న్యూజిలాండ్ పై చేయి.. మరొక రోజు టీమిండియాది పై చేయి అవుతోంది. అయితే నాలుగో రోజు టీమిండియా… అదిరిపోయే బ్యాటింగ్తో అదరగొట్టింది. సర్ఫరాజ్ ఖాన్ , రిషబ్ పంత్ ఇద్దరు అద్భుతంగా ఆడారు. సర్ఫరాజ్ కాన్ సెంచరీ చేయగా రిషబ్ పంత్ మాత్రం సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేవలం ఒక పరుగు తేడాతో రిషబ్ పంత్ సెంచరీ కోల్పోవడం జరిగింది. న్యూజిలాండ్ బౌలర్ విలియం వేసిన బంతిని డిపెండ్ చేసుకునే క్లీన్ బోల్డ్ అయ్యాడు రిషబ్ పంత్. దీంతో ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే టీమిండియా కోసం పోరాడిన రిషబ్ పంత్ సెంచరీ మిస్ చేసుకోవడంతో ఫ్యాన్స్ అందరూ నిరాశకు గురయ్యారు. అటు నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్నకేఎల్ రాహుల్ షాక్ నకు గురయ్యాడు.
ఇప్పటికే 7సార్లు తన టెస్ట్ కెరీర్లో 90 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. ఈ మ్యాచ్ కంటే ముందు… 97, 96 పరుగులు, 93 పరుగులు 92 పరుగులు 91 పరుగుల వద్ద ఇప్పటికే రిషబ్ పంత్ అవుట్ అయి ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ పై మ్యాచ్లో 99 పరుగుల వద్ద అవుట్ కావడం ఏడవ సారి.