రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ తర్వాత యంగ్ టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.ఈ టూర్‌లో టీమ్ ఇండియా టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. విజయకుమార్ వైశాఖ్‌కు సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. టీమ్ ఇండియాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? తెలుసుకుందాం రండి.
దక్షిణాఫ్రికాతో T20సిరీస్ షెడ్యూల్మొ
దటి మ్యాచ్- నవంబర్ 8- డర్బన్
రెండో మ్యాచ్- నవంబర్ 10- డర్బన్
మూడో మ్యాచ్- నవంబర్ 13- సెంచూరియన్
నాల్గవ మ్యాచ్- 15 నవంబర్- జోహన్నెస్‌బర్గ్
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ , అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, అవేష్ ఖాన్, యష్ దయాల్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీం ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ( వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
రిజర్వ్‌లు:
ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.