రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ మోటారైకిల్ ను ఇవాళ EICMA 2024లో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్సైకిలకు క్లాసిక్ ఎలక్ట్రిక్ అనే పేరు పెట్టాలని భావిస్తున్నారు. కంపెనీ ఇటీవలే టీజర్ ను కూడా విడుదల చేసింది. ఇందులో మోటార్సైకిల్ డిజైన్ దాదాపుగా వెల్లడైంది. డిజైన్ పరంగా ఇది సాంప్రదాయ డిజైన్ అంశాలతో కూడిన కొత్త-రెట్రో రోల్స్టర్ డిజైన్ను కలిగి ఉంది.
ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్స్‌తోపాటుగా మరిన్ని ఫీచర్లు పొందుతుంది. కంపెనీ పేటెంట్ చిత్రాల ప్రకారం.., కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అనేక ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్‌ల మాదిరిగానే క్లాసిక్ టియర్ డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్‌ను పొందుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్యాటరీ, మోటర్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. కానీ కంపెనీ పేటెంట్ చిత్రాలు మోటారు ద్వారా శక్తిని వెనుక చక్రానికి నెట్టివేసే బెల్ట్ డ్రైవ్‌గా కనిపిస్తున్నాయి. ఇది PMSM మోటార్‌తో జత చేసిన 5 kW బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుందని అంచనా.
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 50 పీఎస్ పవర్, 100 ఎన్ఎమ్ కంటే ఎక్కువ టార్క్‌ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు ప్రధాన పోటీదారుగా ఉండాలనే లక్ష్యంతో ఉంది. ఈ మేరకు కంపెనీ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 150 కి.మీల రేంజ్‌ను అందించగల బ్యాటరీని అందించే అవకాశం ఉంది. అలాగే గరిష్ట వేగం గంటకు 110 నుండి 120 కి.మీ ఉండవచ్చు.