చలికాలం మొదలైంది. ఇప్పటికే రాత్రిళ్లు చలిగాలులు మొదలయ్యాయి. వింటర్ సీజన్‌లో చల్లటి గాలి శరీరానికి, మనసుకు హాయినిస్తుంది. అయితే, అందరిలో ఓ భయం మొదలైంది. అదే ఈ సీజన్‌లో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలని టెన్షన్ పడుతుంటారు. శీతాకాలంలో అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. పొడిగాలి చర్మంలోని తేమను గ్రహించడం వల్ల స్కిన్ మెరుపు కోల్పోతుంది. చర్మం పొడిబారుతుంది. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై పగుళ్లు ఏర్పడతాయి. చర్మంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. చర్మం దురుగా, పొడిగా, ఎర్రగా మారుతుంది.శీతాకాలంలో అన్నిటి కంటే పెద్ద సమస్య చర్మం పొడిబారడం. దీంతో ముఖం నిగారింపు కోల్పోతుంది. చర్మాన్ని తేమగా ఉంచడం కోసం చాలా మంది ఖరీదైన లోషన్స్, ప్రొడక్స్ వాడతుంటారు. అయితే, కొన్ని సహజ చిట్కాలు పొడి చర్మానికి చెక్ పెడతాయి. పొడి చర్మం కోసం కొబ్బరి నూనె బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. కొబ్బరి నూనెలో కొన్ని పదార్థాలు మిక్స్ చేసి చర్మంపై అప్లై చేస్తే డ్రై స్కిన్ నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాకుండా మీ చర్మం నిగనిగలాడుతుంది. ఆ పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొబ్బరి నూనె చర్మ సంరక్షణకు సహజమైన, సమర్థవంతమైన ఆప్షన్. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యవంతంగా చేస్తాయి. అందుకే పెద్దలు చర్మానికి అప్పడప్పుడూ కొబ్బరి నూనె పట్టించాలని చెబుతుంటారు. చలికాలంలో కొబ్బరి నూనె వాడటం వల్ల చర్మం చాలా కాలం పాటు తేమగా ఉంటుంది. రోజూ పడుకునే ముందు రాత్రి పూట చర్మ సంరక్షణ కోసం కొబ్బరి నూనె వాడటం మంచిదంటున్నారు నిపుణులు. కొబ్బరి నూనె వాడటం వల్ల చర్మం మృదువుగా మారడమే కాకుండా ఉదయం పూట కాంతివంతంగా మెరుస్తుంది. ఇక, డ్రై స్కిన్ కోసం కొబ్బరి నూనెలో ఏయే పదార్థాలు మిక్స్ చేయాలో ఇక్కడ ఓ లుక్కేద్దాం.