ఉపాధ్యాయులకు 6 రోజుల పాటు నిర్భందంగా ఇస్తున్న ఎఫ్. ఎల్. ఎన్ శిక్షణను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ గురువారం డిమాండ్ చేశారు.
అనంతపురంలో ఆయన మాట్లాడుతూ. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి హీల్ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇస్తున్న ఎఫ్. ఎల్. ఎన్ శిక్షణ లో టి. వి. రత్న కుమార్ అనే ఉపాధ్యాయుడు మృతి చెందడం చాలా బాధాకరం అని అన్నారు.