ఉరవకొండ మండలం షేక్షానుపల్లి తండా గ్రామంలో విషాదం నెలకొంది. గత నెల 29 నుంచి కనపడకుండా పోయిన గ్రామానికి చెందిన హేమక్క (66) స్థానిక పొలంలో శవమై కనిపించింది.
స్థానికులు గమనించి మృతదేహం హేమక్కదే ఉంటుందని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొడుకు ఉమాశంకర్ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అక్కడే పోస్టుమార్టం చేశారు.