రావికమతం మండల కేంద్రంలో గంజి వారు రామాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యకర్తల సంక్షేమం టీడీపీ ధ్యేయం సూపర్ సర్పంచ్ గంజి మోది నాయుడు అన్నారు. టీడీపీ రాజకీయాల కోసమే కాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. అందులో భాగంగానే కార్యకర్త కుటుంబాలను ఆదుకోవడం కోసం 100 రూపాయలతో ఐదు లక్షల భీమా సభ్యత్వం చేసుకోవాలని సూపర్ సర్పంచ్ మోది నాయుడు, గంజి ఈశ్వరరావు గురువారం పేర్కొన్నారు.