వేపాడ మండలం కరకవలస ఎంపీపీ పాఠశాలను ఎంఈఓ బాల భాస్కరరావు గురువారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను, తరగతి గదులను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు ఉదయం పూట పంపిణీ చేస్తున్న రాగి జావ నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని కోరారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు. అధ్యాపకులు సమయపాలన పాటించాలని కోరారు.