వాడిన వంట నూనెతో బయోడీజిల్ను తయారు చేసే సరికొత్త పద్ధతిని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన రసాయన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వృథా వంటనూనె, సోడియం టెట్రామెథాక్సిబోరేట్ కలిపి ఈ బయోడీజిల్ను తయారు చేశారు.
కేవలం గంటలోపే ఈ బయోడీజిల్ తయారీ పూర్తవుతుందని చెప్పారు. పారిశ్రామిక అవసరాల కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు 'ఎనర్జీ అండ్ ఫ్యుయెల్స్' అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.