కార్తీక మాసంలో మహిళలు తులసి, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఉసిరికాయ దీపాల్ని కూడా పెడుతుంటారు. ఉసిరి చెట్టు సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపమని శివపురాణం చెబుతుంది.
కాబట్టి కార్తీకమాసంలో ఉసిరి దీపాల్ని పెడితే ఆర్థిక ఇబ్బందులు, అష్ట దరిద్రాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉసిరికాయ దీపాన్ని పెడితే అమ్మవారితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.