ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 02:30 PM

కార్తీకమాసం కొనసాగుతుంది. ఈ ఏడాది ఇప్పటికే ( నవంబర్​ 13 నాటికి) రెండు సోమవారాలు.. ఏకాదశి ముగిశాయి. ఇక తరువాత కార్తీక పౌర్ణమి ( నవంబర్​ 15) న దీపాలు వెలిగించేందుకు జనాలు రడీ అవుతున్నారు.కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏమిటి.. ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. .కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే దీపాలు దేవతలు సంతోషిస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ( 2024) కార్తీక మాసం శుక్ల పక్ష పౌర్ణమిని ఈసారి నవంబర్15 న జరుపుకోనున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం, కార్తీక పూర్ణిమ తిథి నవంబర్ 15వ తేదీ శుక్రవారం ఉదయం 6:19 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 16న శనివారం మధ్యాహ్నం 2:58 గంటలకు పూర్తవుతుంది. ఉదయం తిథి ప్రకారం, ఈసారి కార్తీక పూర్ణిమను నవంబర్ 15వ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటారు.


కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడుతూ చదవాల్సిన శ్లోకం


కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః


జలే స్థలే యే నివసంతి జీవాః!


దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః


భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!


కార్తీక పౌర్ణిమ నాడు దీపాలు వెలిగించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైనది. హవనము, దానము, గంగా స్నానము మరియు పూజలు ఈ రోజున ( నవంబర్​ 15) ప్రత్యేకించి ముఖ్యమైనవి. హిందూ విశ్వాసాలలో కార్తీక పూర్ణిమ అత్యంత ముఖ్యమైన పూర్ణిమగా పరిగణించబడుతుంది, ఇది భగవంతుడిని సంతోషపెట్టడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టినవారు శ్రీమహా విష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసినవారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు. స్తంభ దీపం పెట్టని పిత్రు దేవతలకు నరక విముక్తి కలగదంటారు. నదీ తీరాల్లో దీపాలు వెలిగించే వారు అరటి దొప్పల్లో వెలిగించి నదుల్లో వదులుతారు. ఎలాంటి అవవకాశం లేని వారు ఇంట్లో తులసి చెట్టు దగ్గన అరటి దొప్పల్లో దీపం వెలిగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ( నవంబర్​ 15)న చేసే దీపారాధన వలన ఇహ లోకంలో సుఖ సౌఖ్యాలు... జీవితానంతరం ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.దీని వల్ల ఏడాదిలో మనం ఏదైన ఊరికి వెళ్లిన లేదా మరే కారణం చేతకానీ.. దీపాలు వెలగించడం కుదరక పోతే.. అలాంటి దోషం ఈ 365 వత్తుల దీపంను వెలిగించి పొగొట్టుకొవచ్చంట. అందుకే చాలా మంది తప్పనిసరిగా.. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తుల దీపంను వెలిగిస్తారని పండితులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com