చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై18టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను రెండు కలర్స్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు.ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే0.08 మెగాపిక్సెల్స్‌తో కూడిన సెకండరీ కమెరాను ఇచ్చారు. ఇక సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
వివో వై18టీ స్మార్ట్ పోన్ యూనీసోక్ టీ612 చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు.కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్ 5.2, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, గ్లోనాస్, వై-ఫై, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, మోటార్ గైరో స్కోప్ వంటి ఫీచర్లను అందించారు.4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,499గా నిర్ణయించారు. వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది.