ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 15 శుక్రవారం రోజు జరుపుకోనున్నాము. ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి చాలా ప్రాముఖ్యత ఉంది.కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని, శ్రీ హరివిష్ణువును పూర్ణ క్రతువులతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి కాయ:ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే.. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఒక్క కొబ్బరికాయను సమర్పించండి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఒక్క కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున, అమ్మవారికి ఒక్క కొబ్బరికాయను సమర్పించి, మరుసటి రోజు ఈ కొబ్బరికాయను భద్రంగా మీరు డబ్బు భద్రపరుచుకునే స్థానంలో పెట్టండి. దీనివల్ల ఇంటికి శుభాలు కలుగుతాయి.
మోదుగ పూలు:మత విశ్వాసాల ప్రకారం, మోదుగ పూలు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనది. కార్తీక పౌర్ణమి రోజున పూజ చేస్తున్నప్పుడు, లక్ష్మీదేవికి పలాస పుష్పాన్ని సమర్పించండి. అదే సమయంలో ఇంట్లో పలాస పూల మొక్కను నాటడం ద్వారా కూడా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. ఫలితంగా ఇంటి నుండి దారిద్ర్యం తొలగిపోతుంది.
బంగారం, వెండి:
కార్తీక పౌర్ణమి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే లక్ష్మీ దేవి యొక్క అపారమైన ఆశీర్వాదం పొందడానికి, ఇంట్లో ఆనందం , శ్రేయస్సును పెంచడానికి, వీలైతే, పౌర్ణమి రోజున బంగారం లేదా వెండిని కొనుగోలు చేయండి.కార్తీక పౌర్ణమి రోజున పురాణాల ప్రకారం శంకరుడు త్రిపురాసురుడిని సంహరించాడు. దీంతో సంతోషంలో దేవతలు దీపాలు వెలిగించారు. అప్పటి నుండి దేవ్ దీపావళిని జరుపుకునే సంప్రదాయం ఉంది. దేవ్ దీపావళి రోజున దేవతలందరూ కాశీకి వస్తారని, అందుకే వారణాసిలో పండుగ వైభవాన్ని చూడాలని చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు కార్తీక పూర్ణిమ రోజు చాలా పవిత్రమైనదిగా చెబుతారు. ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదు.
1. కార్తీక పూర్ణిమ రోజున సత్యనారాయణ కథను చదవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతుష్టులై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.
2. పూర్ణిమ తిథి రోజున రావి చెట్టుకు తీపి పాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు.
3. కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీ దేవికి పసుపు కొమ్ములు సమర్పించి, ఆ తర్వాత డబ్బు భద్రపరుచుకునే ప్రదేశంలో ఉంచాలి. ఇలాచేయడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
4. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో గంగాస్నానం చేసి శివాలయంలో మహామృత్యుంజయ సంపుట్ మంత్రాన్ని పఠిస్తే పెండింగ్ పనుల్లో విజయం చేకూరుతుందని, శత్రువులు ఓడిపోతారని, కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
5. కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని, శాలిగ్రామ భగవానుని పూజించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మనిషిలోని కోరికలు తొలగిపోతాయని, జీవితంలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.