ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరు, అమెజాన్ ఫౌండర్ 'జెఫ్ బెజోస్' మళ్ళీ పెళ్లి పీటలెక్కనున్నారు. తన ప్రేయసి 'లారెన్ శాంచెజ్'ను డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లిచేసుకోనున్నట్లు తెలుస్తోంది.2018 నుంచి బెజోస్, లారెన్ డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయం 2019లో బయటకు వచ్చింది. గతంలో జర్నలిస్టుగా పనిచేసిన 54 ఏళ్ల లారెన్ అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2023 మేలో బెజోస్, లారెన్ నిశ్చితార్థం జరిగినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఈమెకు సుమారు రూ.21 కోట్ల ఖరీదైన పింక్ డైమండ్ రింగ్ ఇచ్చినట్లు సమాచారం.60 ఏళ్ల జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌కు 2019లోని విడాకులు ఇచ్చారు. అప్పటికే వీరిద్దరికి నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల తరువాత బెజోస్, లారెన్ బంధం బయటపడింది. లారెన్‌కు కూడా గతంలో పాట్రిక్ వైట్‌సెల్, మాజీ ఎన్ఎఫ్ఎల్ క్రీడాకారుడు టోనీ గోంజలెజ్‌తోనూ పెళ్లైంది. ఈ ఇద్దరి ద్వారా ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.
జెఫ్ బెజోస్ నికర విలువ
ప్రపంచలోనే అత్యంత ధనవంతులైన.. టాప్ 10 కుబేరుల జాబితాలో ఒకరుగా నిలిచిన జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండర్. ఈయన నికర విలువ 2024 నవంబర్ 13 నాటికి 230 బిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.1,94,17,68,88,43,000.