డబ్బు ఆదా చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యం. ప్రతి ఇంట్లో తల్లితండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేస్తారు. పిల్లల అవసరాలు, చదువులు, వివాహాలు అంటూ ఎన్నో ఖర్చులు ఉంటాయి.అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మరెన్నో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డబ్బు ఆదా చేయాలి. కానీ ఎలా చేయాలో తెలియక కొంతమంది సతమతమవుతారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం వాత్సల్య పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం గురించి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. ప్రభుత్వం పథకాలను అందిస్తున్నా అవి ప్రజలకు చేరువ కావట్లేదు. అందువల్ల డబ్బు ఆదా చేసే విషయంలో నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అసలు పిల్లలకు ఎలాంటి పథకాలు లేవు అనుకుంటున్నారు. కానీ చిన్న పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాత్సల్య పథకం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. అప్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన పథకాల్లో ఇదొక మంచి పథకం అని చెప్పవచ్చు. రోజుకు రూ. 30 పొదుపు చేస్తే ప్రతి నెల రూ. 3 లక్షలు పొందవచ్చు అంట! ఈ పథకానికి ఎవరు అర్హులు ఎలా పొదుపు చేయాలనే విషయాలు అన్నీ తెలుసుకుందాం రండి...కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన సరికొత్త పథకం [ NPS VATSLYA] నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య. దీని ద్వారా తక్కువ పెట్టుబడి అధిక లాభాలను సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా భారీ బెనిఫిట్స్ ను అందుకోవడంతో పాటు లైఫ్ టైమ్ సెటిల్మెంట్ ఉంటుంది. సేవింగ్స్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్ కింద తల్లితండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేరుపై డబ్బులు పొదుపు చేయొచ్చు. ఉద్యోగాలు చేసే వారికే కాదు ఇప్పుడు పిల్లలకు కుడా ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ వస్తుంది. ఒక రకంగా ఇది పెన్షన్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు.వీరే అర్హులు, పెట్టుబడి ఎంత?: ఈ పథకం కేవలం 18 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికే వర్తిస్తుంది. వీరి పేరుపై తల్లితండ్రులు ప్రతి నెల డబ్బు ఆదా చేస్తారు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ పెట్టుబడి పెడతారు. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాత పేరెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోతుంది. అప్పుడు అది టైర్ 1 ఎన్‌పీఎస్ అకౌంట్‌గా మారిపోతుంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1000 నుంచి డబ్బులు దాచుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. అంతేకాకుండా పాక్షిక విత్‌డ్రాయెల్, పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నెలకు రూ.1000 చొప్పున ఆదా చేస్తే ఏడాదికి రూ. 12 వేలు అవుతుంది. అలాగే ప్రతి ఏటా పెట్టుబడి మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. అంటే మొదటి సంవత్సరం రూ.1000 దానికి 10 శాతం కలిపితే 1100 వచ్చే ఏడాది కలిపి ఏడాది పాటు పెట్టుబడి పెట్టాలి. అలా ప్రతి ఏడాది పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లాలి. అంటే పిల్లలకు 18 ఏళ్లు వచ్చేసరికి మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ రూ. 5,47,190 లకు అవుతుంది.రాబడి ఎంత వస్తుంది ? 10 శాతం రాబడి అంచనా వేసుకున్నా రూ. 7 లక్షల వరకు ఉంటుంది. అంటే మొత్తంగా రూ. 12 లక్షలు అవుతుంది. అలాగే తల్లితండ్రుల తర్వాత పిల్లలు సైతం ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసాగిస్తూ... వారికి 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు ఈ పథకం లో పెడితే వారు పెట్టే పెట్టుబడి మొత్తం రూ. 15.34 కోట్లు అవుతుంది. ఎన్‌పీఎస్ రూల్స్ ప్రకారం మొత్తం పెట్టుబడిలో 40 శాతం అంటే రూ. 6.14 కోట్లు యాన్యుటీ స్కీమ్‌లో పెట్టాలి. ఇక్కడ యాన్యుటీ రేటు 6 శాతం పరిగణలోకి తీసుకుంటే.. నెలకు రూ. 3.06 లక్షల వరకు రిటైర్మెంట్ పెన్షన్ గా ప్రతి నెల వారికి లభిస్తుంది. పిల్లల పెద్దవారు అయిన తర్వాత వారి జీవితానికి భరోసాగా ఈ పథకం ఉపయోగపడుతుంది.