ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. బడ్జెట్‌పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. వైసీపీ సర్పంచులు ఉన్న చోట నిధులు ఇవ్వకపోవడంతో రూ. 1450 కోట్లు గ్రామాలకు అందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం చివరకు చిన్న పిల్లల చిక్కీల్లోనూ రూ.175 కోట్లు బకాయిలు పెట్టిందని అన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతం ఇవ్వడం మర్చిపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు మేలు చేశామని ఉద్ఘాటించారు.
అమరావతికి ఇచ్చిన రూ. 15వేల కోట్లు అప్పుగా తెచ్చామో, గ్రాంటా అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఢిల్లీకి వెళ్లారంటే వారి వ్యక్తిగత కేసుల కోసమేనని ఆరోపించారు. రైల్వేజోన్‌కు త్వరలోనే భూమి పూజ చేయిస్తామని తెలిపారు. రూ. 55 వేల కోట్ల జాతీయ రహదారిని రెండున్నరేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం డివెల్యూషన్‌లో రూ. 5700 కోట్లు అధనంగా ఈసారి వచ్చిందని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రుల ప్రతి ఢిల్లీ పర్యటన ఏదో ఒక లబ్ధిని రాష్ట్రానికి కలుగ జేస్తోందని తెలిపారు. కేన్స్‌ర్‌పై అవగాహనతోపాటు స్కీనింగ్‌కు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దళిత విద్యార్థులకు నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పయ్యవుల కేశవ్ హామీ ఇచ్చారు.