తిరుమలలో గతంలో కొన్ని అపచారాలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమలలో గురువారం తిరుప్పావడ సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదాలు ఎలా ఉండేవో అందరం చూశామని, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటే ఆత్మసంతృప్తి కలుగుతోందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా మార్పులు చేశారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలని, ముఖ్య ంగా యువతకు మంచి ఉపాధి అవకాశాలు వచ్చేలా ఆశీస్సులు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నానని రవీంద్ర తెలిపారు.