రాయలసీమకు తొలి నుంచి అన్యాయం జరుగుతోంది అని మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.... గతంలో ఏ పాలకులూ ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. చివరకు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమలో పెట్టాలన్నారు. దాని కోసం బార్ కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోయింది. హైకోర్టు ఏర్పాటు కాలేదు. ఒక్క వైయస్ఆర్ , వైయస్ జగన్ హయాంలోనే రాయలసీమకు మేలు జరిగింది. వైయస్ జగన్ కర్నూలులో హెచ్‌ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, లోకాయుక్త, సీబీఐ కోర్టు ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలని మూడు రాజధానుల్లో కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు.
రెండో లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెట్టాలని ఆలోచించి భూమితో పాటు, రూ.100 కోట్ల నిధులు కూడా కేటాయించారు. ఇప్పుడు దాన్ని కూడా చంద్రబాబు తరలించుకుపోయారు. గతంలో హైదరాబాద్ ఒకే రాజధానిగా ఉండడం వల్ల చాలా నష్టపోవాల్సి వచ్చింది, అలా జరగకూడదని వైయస్ జగన్ ఆలోచించారు. కొప్పర్తి ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కూడా అమరావతికి తరలించుకుపోయారు. టీడీపీని ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్ దీనిపై సమాధానం చెప్పాలి. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు స్పందించాలి. రాయలసీమ అభివృద్ధి కోసం కలిసి వచ్చే వారితో మేము కలిసి పని చేస్తాం. ఆందోళన చేస్తాం అని తెలియజేసారు.