మంత్రి సత్యకుమార్ తీరును నిరసిస్తూ శాసన మండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై మంత్రి సత్య కుమార్ సమాధానానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో అన్ని మెడికల్ కాలేజ్ల నిర్మాణానికి ఒకే విధమైన నిధులు ఖర్చు చేయలేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. పులివెందుల కాలేజ్ నిర్మాణానికి రూ.500 కోట్లకు గారూ. రూ. 290 కోట్లు ఖర్చు చేశారని మంత్రి తెలిపారు.
అదే సమయంలో మార్కాపురం కాలేజ్ కోసం రూ. 475 కోట్లకు గానూ కేవలం రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి సత్య కుమార్ తెలిపారు. పులివెందులపై ఉన్న శ్రద్ధ రాయలసీమలోని ఇతర కాలేజ్లపై ఎందుకు లేదో వైసీపీ సభ్యులు చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. పులివెందులలో ఆడపిల్లల హాస్టల్స్ కట్టకుండా వారు చెట్ల కింద కూర్చొని చదువుకోవాలా అని మంత్రి నిలదీశారు. ప్రతిరోజు మెడికల్ కాలేజీలపై కూటమీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సత్యకుమార్ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.