ఎంఎస్ఎంఈ ఇండ్రస్ట్రియల్ పాలసీపై శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రైవేటు వ్యక్తులు పార్క్ అభివృద్ధి చేసుకుంటే అందులో ఎవరైనా ఎస్సీ ఎస్టీ, బీసీ లు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వారికి పదిశాతం అదనపు రాయితీ ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అయితే పార్క్‌లో స్థలాల కేటాయింపులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నారా లేదా అని మండలి ఛైర్మన్ ప్రశ్నించారు. ఇదే అంశంపై స్పష్టత ఇవ్వాలని వైసీపీ సభ్యులు రవిబాబు, రవీంద్ర బాబు అన్నారు.ఏపీఐఐసీ భూములు, ప్రభుత్వ భూముల్లో పార్క్‌లు అభివృద్ధి చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు స్థలాల్లో పార్క్‌లు అభివృద్ధి చేసిన చోట పరిశ్రమలు పెట్టుకునేందుకు ముందుకొస్తే వారికి కూడా పది శాతం అదనపు రాయితీ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. పాలసీ విధివిధానాలుపై రాతపూర్వకంగా ఇవ్వాలని వైసీపీ సభ్యుడు రవిబాబు పట్టుపట్టారు. మంత్రి స్టేట్‌మెంట్ ఇస్తుంటే దానిపై వివరణ అడగటం, చర్చకు తెర తీయడం సాంప్రదాయం కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.