Vivo తన కొత్త X200 సిరీస్‌ను నవంబర్ 19, 2024న మలేషియాలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రకటన తర్వాత ఈ సిరీస్‌ను నవంబర్ 28న థాయ్‌లాండ్, వచ్చే నెలలో భారతదేశంలో ప్రారంభించవచ్చని అంచనాలు ఉన్నాయి.ఈ సిరీస్‌లో రెండు మోడల్‌లు ఉంటాయి - Vivo X200, X200 Pro. అయితే Vivo X200 Pro మినీ చైనాకు మాత్రమే పరిమితం అవుతుంది.X200 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 nits వరకు బ్రైట్నెస్ ఉంటుంది. రెండు మోడల్‌లు MediaTek డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో ఉంటాయి. ఇది LPDDR5x RAM, UFS 4.0 స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తాయి. 5,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
అయితే Pro వెర్షన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రెండు మోడల్‌లు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. ప్రో వెర్షన్ 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది.కెమెరా గురించి మాట్లాడితే Vivo X200 మూడు 50MP లెన్స్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతుంది, ఇందులో వైడ్, అల్ట్రావైడ్, 3x జూమ్ షాట్‌లు ఉంటాయి.అదే సమయంలో X200 ప్రోలో 200MP టెలిఫోటో లెన్స్ ఉంది, ఇది 3.7x జూమ్‌తో వస్తుంది. భారతదేశంలో Vivo X200 సిరీస్లాంచ్ తేదీ ఇంకా ధృవీకరించలేదు, అయితే ఇది డిసెంబర్ 2024లో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సిరీస్ వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర భాగస్వామి రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.