ఐక్యూ జెడ్ 9 లైట్ 5జీ అసలు ధర రూ. 14,999కాగా అమెజాన్‌లో 28 శాతం డిస్కౌంట్‌తో రూ. 10,498కి లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే ఈ ఫోన్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
Lava Storm 5G: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 14,999కాగా అమెజాన్‌లో సేల్‌లో భాగంగా రూ. 10,999కే లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 వంటి పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.POCO M6 5G: రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ 5జీ ఫోన్ పోకో ఎమ్6. ఈ ఫోన్ అసలు ధర రూ. 13,999కాగా 29 శాతం డిస్కౌంట్‌తో రూ. 9,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమఏహెచ్ బ్యాటరీని అందించారు 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు.
Redmi 13C 5G: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 13,999కాగా అమెజాన్‌లో 33 శాతం డిస్కౌంట్‌తో రూ. 9,199కి లభిస్తోంది. ఇందులో మీడియాటెక్ 6100+ 5జీ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇచ్చారు. 50 ఎంపీ రెయిర్ కెమెరా ఈ ఫోన్ సొంతం.
TECNO POP 9 5G: రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ 5జీ ఫోన్స్‌లో ఇది ఒకటి. ఈ ఫోన్ అసలు ధర రూ. 11,999కాగా అమెజాన్‌లో 17 శాతం డిస్కౌంట్‌తో రూ. 9,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 48 ఎంపీతో కూడిన సోనీ ఏఐ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని ఇచ్చారు.