శుద్ధజలప్రాజెక్ట్, వాటర్ గ్రిడ్ పనులను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం బుగ్గానిపల్లె తాండ దగ్గరున్న వాటర్ గ్రిడ్ ను సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. వచ్చే వేసవి నాటికి డోన్ మండలం లోని గ్రామాలకు ఈ వాటర్ గ్రిడ్ పనులు పూర్తి చేసి, డోన్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేవిధంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.