వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడు గణపతినగర్ అమరవీరుల 46 సంస్మరణ సభను శుక్రవారం నిర్వహించారు. 1969 నవంబర్ 22న శ్రీకాకుళ సాయుధ పోరాట అమరవీరులు తామాడ గణపతి.
డా. చాగంటి భాస్కరరావులు పోలీసుల బూటకపు ఎదురు కాల్పుల్లో అమరత్వం చెందారని పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు హిమ, రైతు కూలీ సంఘం, ఐఎన్టీయూ నాయకులు తెలిపారు. జీడి పంటకు గిట్టుబాటు ధర కోసం, ఉద్దానం కిడ్నీ వ్యాధి నివారణ కోసం సమరశీల పోరాటాలు తప్పవన్నారు.