ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలోని కోటి తీర్థం గ్రామంలో శుక్రవారం రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభ చేజర్ల తహసీల్దార్ మస్తానయ్య ఆధ్వర్యంలో జరిగింది. కోటి తీర్థం రెవెన్యూ గ్రామ విభజనపై తహసిల్దార్, ఎంపీడీవో, అధికారులు గ్రామస్తులతో చర్చించారు. వారికి అవగాహన కల్పించారు. ఈనెల 25వ తేదీ నాటికి అభ్యంతరాలు ఉన్నట్లయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.