పుష్కర ఎత్తిపోతల పథకంలో భాగమైన తాళ్లూరు లిప్ట్ పైపులు లీకేజీలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం చెప్పారు. లిప్ట్ స్కీమ్‌ల నిర్వహణ, మోటార్ల మరమ్మత్తులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా జగన్ ఎత్తిపోతలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
అందుకే జగన్ హయాంలో 1040 లిప్ట్ స్కీములకు గానూ 450 స్కీమ్‌లు మూతపడ్డాయని తెలిపారు. జగన్ పాలన పాపం ఫలితంగా లిప్ట్ స్కీములు పనిచేయక 4లక్షల ఎకరాలు బీడుపడ్డాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్ మాత్రమే కాదని.. రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్‌కు సంబంధించి పీఎస్‌సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.