ఒకే రాష్ట్రం ఓకే రాజధాని అన్న నినాదం కూటమి ప్రభుత్వానిదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని గతంలోనే హామీ ఇచ్చామని తెలిపారు. దాని కోసమే డాటా సెంటర్ పాలసీని కూడా రూపకల్పన చేశామని చెప్పారు. అసెంబ్లీలో ఐటీ పాలసీపై చర్చ జరిగింది. ఈ సభలో మంత్రి నారా లోకేష్ పలు కీలక విషయాలు వెల్లడించారు.జగన్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు సంబంధించిన ఒక్క కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదని చెప్పారు. వైసీపీ హయాంలోని ఐటీ మంత్రి గుడ్డూ-కోడి అంటూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో ఏపీ ఐటీ మంత్రి ఇలా ఉంటారా అంటూ కూడా గతంలో కొందరు మాట్లాడారని గుర్తుచేశారు. గడచిన ఐదు నెలల్లో చాలా ఐటీ సంస్థలతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు.