పాదాల కింద భాగం అకస్మాత్తుగా ఉబ్బిన్నట్లైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. తీవ్రమైన గుండె నొప్పి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు తరచుగా పాదాలు వాపు వస్తాయి. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ల విలువల్లో తేడాలు వచ్చినప్పుడు కాళ్లు వాచే అవకాశం ఉంటుంది. ఎలాంటి శ్రమ చేయకుండా మడమలు పగుళ్లు ఏర్పడితే, విటమిన్ బి3, ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉండవచ్చు.శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల గౌట్ వ్యాధి వచ్చే చాన్స్ ఉంది. ఇది పాదాల్లో ఎక్కువ మంటను కలిగిస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.తరచుగా కాళ్లలో తిమ్మిరి వస్తున్నటైతే శరీరంలో మెగ్నీషియం లోపం ఉందని అర్థం. మెగ్నీషియం లోపం వల్ల కాళ్లలో తిమ్మిరి ఏర్పడుతుంది. డీహైడ్రేషన్, శరీరంలో ఎలక్ట్రోలైట్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం అల్లం టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అల్లంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మధుమేహం సమస్యలు ఉన్నవారికి ఈ సంకేతాలు కనిపించిన వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది.