బాపట్ల జిల్లా, చీరాల మండలం ఈపూరుపాలెంలో ఐదు నెలల క్రితం కామాంధులకి బలైన సుచరిత కుటుంబానికి వైయస్ఆర్ సీపీ అండగా నిలిచింది. వైయస్ఆర్ సీపీ తరఫున బాధిత కుటుంబానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విధితమే.
వైయస్ జగన్ ఆదేశాల మేరకు శనివారం బాధిత కుటుంబాన్ని బాపట్ల జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున , చీరాల వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్ కరణం వెంకటేష్ , వైయస్ఆర్ సీపీ నాయకులు పరామర్శించి, రూ.10 లక్షల చెక్కును అందించారు.బాధిత కుటుంబానికి వైయస్ఆర్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న మేరుగు నాగార్జున గారు, కరణం వెంకటేష్ హామీ ఇచ్చారు. కూటమి పాలనలో అమాయక బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని హెచ్చరించారు.