టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, వారి కుటుంబం గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారికి వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. కొంతమంది ఇప్పుడు తప్పైపోయిందంటూ సారీలు చెప్తున్నారన్న బుద్ధా వెంకన్న.. రాజకీయాలు వదిలేసినా కూడా తాము వదిలి పెట్టేదిలేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన కుటుంబం గురించి ఎవరెవరు ఏం మాట్లాడారనేది తమ వద్ద ఉందన్న బుద్ధా వెంకన్న.. ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.