ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడడం సిగ్గుచేటని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టింది మీరే కదా జగన్.. అని మంత్రి ప్రశ్నించారు. ఐదేళ్లపాటు విద్యార్థులను మోసం చేసిన జగన్ అధికారం కోల్పోయాక మొసలి కన్నీరు కార్చుతున్నాడని విమర్శించారు.