బాదంపప్పులను ప్రతిరోజూ తినేవారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా శీతాకాలంలో రోగనిరోధక శక్తి కోసం బాదం పప్పులను తింటూ ఉంటారు. అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూలను కూడా అధికంగా తింటూ ఉంటారు. ఈ లడ్డూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో జలుబు, దగ్గు బారిన పడకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా త్వరగా అనారోగ్యానికి గురికాకుండా కాపాడతాయి.
అయితే, నిజమైన బాదం పప్పుల ఆకారం పొడవుగా, గుండ్రంగా ఉంటుంది. వీటి రంగు లేత గోధుమ లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అదే నకిలీ బాదం పప్పుల విషయానికి వస్తే వాటి ఆకారం అసాధారణంగా ఉంటుంది. దాని రంగు కూడా కొంచెం తేడాగా ఉంటుంది.
రుచి
నిజమైన బాదం తీపి, క్రీమీ రుచిని కలిగి ఉంటుంది. అదే కల్తీ బాదం పప్పులు తింటే కొంత చేదు రుచిని కలిగిస్తాయి.
నీటి టెస్ట్
నిజమైన బాదం పప్పులను నీటిలో నానబెట్టిన కొన్ని గంటల తర్వాత, వాటి తొక్కలు సులభంగా ఊడి వచ్చేస్తాయి. కానీ నకిలీ బాదం తొక్కలు అంత సులభంగా బయటకు రావు.
నూనె
నిజమైన బాదం పప్పులను చేతిలో రుద్దడం వల్ల వాటి నుండి తేలికపాటి నూనె విడుదల అవుతుంది. నకిలీ బాదం పప్పులను చేత్తో గట్టిగా నలిపితే నూనె ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు.