కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి ఉత్కళాంధ్రులు ఎండల మల్లన్నను దర్శించుకున్నారు. ఉచిత దర్శనం, సర్వదర్శనం, శిఖర దర్శనాల క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు. దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా దేవాదాయశాఖ ఈవో జి.గురునాథరావు చర్యలు తీసుకున్నారు. మజ్జిగ, మంచినీరు, ప్రసాదం పంపిణీ కార్యక్రమాలను పూర్వపు ఆలయ కమిటీ చైర్మన్ ఎల్ఎల్ నాయుడు పర్యవేక్షించారు. వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు రావివలస రాకపోక మార్గాలు కిక్కిరిశాయి. గోపీనాథపురం, పాతబస్టాండ్ జంక్షన్లలో కొంతసేపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.