మహా విశాఖ నగరాభివృద్ధి సంస్థ పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో కొత్త ప్రాజెక్టులు చేపట్టే ప్రయత్నం చేస్తోంది. శరవేగంతో అభివృద్ధి చెందుతున్న రుషికొండ ప్రాంతంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ‘అర్బన్ హేబిటేట్ సెంటర్’ నిర్మాణానికి ప్రణాళికలు, డిజైన్లు రూపొందించింది. విశాఖపట్నంలో ఈ తరహా ప్రాజెక్టు ఇదే మొదటిది కావడం గమనార్హం. ఇందుకు మధురవాడ లా కాలేజీ సమీపాన రుషికొండ రోడ్డులో 8.82 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. అందులో రూ.470 కోట్ల వ్యయంతో పీపీపీ విధానంలో ఈ అర్బన్ హాబిటేట్ సెంటర్ నిర్మాణానికి యత్నిస్తోంది.