భారతీయ రైల్వే నెట్ వర్క్ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 1.30 లక్షల కిలోమీటర్ల రైల్వే మార్గం ఉంది. ప్రతిరోజు రెండు కోట్లమంది ప్రయాణికులను 13,600 రైళ్లద్వారా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.అత్యంత ఖర్చు తక్కువతో సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా రైల్వే ప్రయాణానికే మొగ్గుచూపుతారు. భారతీయ రైల్వేలో వివిధరకాల రైళ్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. శతాబ్ది, రాజధాని, దురంతో, వందేభారత్ లాంటి రైళ్లు సేవలందిస్తున్నాయి. ఈ తరహా రైళ్లు కాకుండా ప్రత్యేకంగా ఓ రైలు ఉంది. ఆసియా ఖండంలోనే అత్యంత ఖరీదైన రైలుగా పేరు తెచ్చుకుంది.మహారాజా ఎక్స్ ప్రెస్మన దేశంలో అత్యంత ఖరీదైన రైలుగా పేరు తెచ్చుకున్న ఈ రైలు పేరు మహారాజా ఎక్స్ ప్రెస్. ఆసియాలోనే అత్యంత లగ్జరీ రైలు. విలాసవంతమైన సౌకర్యాలకు నిలయం. దీనికి అద్దె లక్షల రూపాయల్లో ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఫైవ్ స్టార్ హోటల్ లాంటిది అని చెప్పొచ్చు. ఈ రైలు ఎక్కిన ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుతాయి. వీటిని రాజ్ షాహీ సేవలంటారు. భారతీయ రైల్వే దీన్ని 2010లో ప్రారంభించింది. ఇందులో టికెట్ తీసుకున్న తర్వాత ఎనిమిది రోజులు ప్రయాణించొచ్చు. వారణాసిలో స్నానాలు చేసే ఘాట్ కు, రణతంబోర్, ఖజురహో దేవాలయం, తాజ్ మహల్ లాంటి ప్రత్యేకమైన ప్రదేశాలకు తీసుకువెళుతుంది.విలాసవంతమైన, లగ్జరీ సౌకర్యాలు ఇందులో కుర్చీలు ఎంతో రాయల్టీగా ఉంటాయి. రాజుల కాలంనాటి తరహాలో ఉంటాయి. రాయల్ చిక్ కుర్చీలు, విలాసవంతమైన మంచాలుంటాయి. దేశంలోని నాలుగు వేర్వేరు మార్గాల్లో ఇది ప్రయాణిస్తుంది. మనం ఏ మార్గంలో ప్రయాణించాలంటే ఆ మార్గానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్ సీటీసీ దీన్ని నిర్వహిస్తోంది. స్నానం చేయడానికి అద్భుతమైన స్నానాల గది, మినీ బార్, లైవ్ టీవీ, పడక గది, పెద్ద పెద్ద అద్దాలతో కిటికీలు ఉంటాయి. సూట్, జూనియర్ సూట్, డీలక్స్ క్యాబిన్, డీలక్స్, ప్రెసిడెన్షియల్ సూట్ అని కేటగిరిలుగా ఉంటాయి. అందులో మనకు అందుబాటులో ఉండేవాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఛార్జీలు రూ.4 లక్షలు, రూ.7 లక్షలు, రూ.5 లక్షలు, రూ.12 లక్షలుగా ఉంటాయి. ఇవి మార్గాన్ని బట్టి మారుతుంటాయి. మనం ఎంచుకునే సూట్ ను బట్టి మారుతుంటాయి. మహారాజా ఎక్స్ ప్రెస్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవాలి. అంతంత ఖర్చుపెట్టి ప్రయాణించగలం అనే ధైర్యం ఉంటే వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి.