స్కిల్ సెన్సస్ నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని, యువతకు ఉద్యోగాల కల్పనే సెన్సస్ అంతిమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సస్, స్కిల్ డెవలప్ మెంట్ శాఖపై బుధవారం తాడేపల్లి మండలం ఉండవల్లి నివాసంలో లోకేశ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎసెస్ మెంట్ చేయకుండా కేవలం సెన్సస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ప్రిఎసెస్ మెంట్ కూడా వేగంగా పూర్తిచేయాలని అన్నారు.