అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన మన్యం జిల్లా బలిజిపేట మండలంలో చోటు చేసుకుంది. వెంగాపురం గ్రామానికి చెందిన రవి(42) ఇటుక బట్టీ నిర్వహిస్తుంటారు. గ్రామంలో పలువురి వద్ద అప్పులు చేశారు.
మంగళవారం గడ్డి మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయనగరం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.