ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆవాల నూనెలో ఈ ఆకు మరిగించి రాసుకుంటే చాలు.. తెల్ల జుట్టు కాస్తా నల్లగా

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2024, 09:10 PM

ప్రతి ఒక్కరికి జుట్టు అంటే తెగ ఇష్టం. ఎందుకంటే... జుట్టు అందానికి తీసుకువస్తుంది. ఒత్తైన, మెరిసే, పొడవైన కేశాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, జుట్టు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. జన్యులోపాలు, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, దుమ్ము కారణంగా తెల్లజుట్టు ఈ జనరేషన్‌లో సమస్యగా మారింది. తెల్లజుట్టుతో నలుగురిలోకి వెళ్లాలంటే కొందరు ఇబ్బంది పడుతున్నారు. నిండా ముప్పై ఏళ్లు నిండక ముందే తలంతా తెల్ల వెంట్రుకలతో కనిపించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు ఈ సమస్య గురించి అంతక పట్టించుకోరు. మరికొందరు మాత్రం సీరియస్‌గా ఉంటారు. హెన్నా, హెయిర్ డై, మార్కెట్‌లో దొరికే వివిధ ప్రొడక్ట్స్‌ వాడి తెల్ల జుట్టు కాస్తా నల్లగా మార్చుకుంటున్నారు.


హెయిర్ డై, హెన్నా, హెయిర్ కలర్ వంటి వాటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టుకు హాని కలిగిస్తాయి. అలాంటప్పుడు జుట్టును నల్లగా మార్చడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వచ్చు. ఈ రెమెడీస్‌లో మస్టర్డ్ ఆయిల్ (ఆవాల నూనె) కూడా ఉంది. అవును, ఆవాల నూనె జుట్టును బలంగా మార్చడంతో పాటు నల్లగా మారుస్తుంది. అయితే.. ఆవనూనెలో ఒక ఆకు కలిపి రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఆవనూనెలో ఏం కలిపి రాస్తే ఫలితం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.


ఆవాల నూనెలో కరివేపాకు..


​తెల్ల వెంట్రుకలు నల్లబడాలంటే కరివేపాకును ఆవాల నూనెలో కలిపి రాసుకోవచ్చు. వాస్తవానికి, కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. జుట్టులోని మెలనిన్‌ను పునరుద్ధరించడానికి పనిచేస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రోటీన్, బీటా-కెరోటిన్, సెలీనియం, జింక్, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇది జుట్టు తెల్ల రంగును నివారిస్తుంది. ఆవాల నూనె తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు నల్లబడటానికి సహాయపడుతుంది.


అవసరమైన పదార్థాలు..


ఆవాల నూనె - ఒక గిన్నె


కరివేపాకు - 10 -15 రెబ్బలు


ఎలా తయారుచేయాలి..


ముందుగా ఒక పాన్‌లో ఆవాల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో కరివేపాకు వేసి తక్కువ మంట మీద మరిగించాలి. నూనె రంగు కొద్దిగా నల్లగా మారినప్పుడు, గ్యాస్‌ను ఆపివేయండి. ఆ తర్వాత నూనెను చల్లబరిచి ఫిల్టర్ చేయండి. ఆ నూనె గాజు పాత్రలో లేదా సీసాలో తీసుకుని నిల్వ చేసుకోండి.


వాడే పద్ధతి..


ఆవాల కరివేపాకు నూనె వాడటానికి ముందుగా తల దువ్వండి. ఇప్పుడు ఈ నూనెను స్కాల్ప్, హెయిర్‌పై బాగా అప్లై చేసి 10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. కనీసం 2 గంటలు లేదా రాత్రంతా అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ సహాయంతో జుట్టును శుభ్రం చేసుకోండి. ఈ నూనెను వారానికి 2-3 సార్లు ఉపయోగించడం వల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు రాలడం, పల్చటి వెంట్రుకల సమస్య నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది.


ఇది కూడా ట్రై చేయండి..


మీరు తెల్ల జుట్టు నల్లబడటం కోసం హెన్నా - ఉసిరి ప్యాక్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ కోసం ముందుగా నాలుగు స్పూన్ల ఉసిరి పొడిని తీసుకోండి. ఉసిరి పొడిని నీళ్లల్లో కలిపి పేస్టులా చేసుకోండి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల హెన్నా వేసి బాగా మిక్స్ చేసుకోండి. కాసేపు తర్వాత ఈ ప్యాక్‌ను జుట్టుకు బాగా అప్లై చేయండి. జుట్టు కుదళ్ల వరకు అప్లై చేయండి. ఈ హెయిర్ మాస్క్‌ను ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


గమనిక..ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com