ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి రూ10వేల కోట్ల ప్యా కేజీని ప్రభుత్వం ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని సుందరయ్యభవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం నిధులు కేటాయించేలా అధికార పార్టీ నేతలు ప్రభుత్వంపై వత్తిడి తేవాలన్నారు. కనిగిరిలో నిమ్జ్, దొనకొం డలో పారిశ్రామిక కారిడార్ సాధనకు పోరాటాలు చేస్తామన్నారు. ప్రస్తుతం గ్రానైట్ పరిశ్రమ సంక్షో భంలో ఉందని, ఆక్వా రంగం కుదేలైందని, ప్రభు త్వ విధానాలతో చిన్న పరిశ్రమలు దివాళా తీసే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఆయా పరిశ్ర మల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చీమకుర్తిలో ఈనెల 13వతేదీ నుంచి మూడు రోజుల పాటు సీపీఎం జిల్లా 13వ మహాసభలు జరుగుతాయన్నారు. తొలిరోజు చీమ కుర్తి ఆర్టీసీ బస్టాండు నుంచి ర్యాలీ, బహిరంగ స భ ఉంటుందని చెప్పారు. ప్రారంభ బహిరంగసభ లో సీపీఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్య దర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కారుసాల సుబ్బరావమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామ హేశ్వరరావు హాజరవుతారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 14,15తేదీల్లో ప్రతినిధుల సభ ఉంటుందని, ప్రాజెక్టులపై చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. అనంతరం పోస్టర్లను ఆవి ష్కరించారు. కార్యక్రమంలో నాయకులు పూనాటి ఆంజనేయులు, జీవీ.కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.