చలికాలంలో వృద్ధులు, పిల్లలు త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా జలుబు, కళ్ల నుంచి నీరు కారుట వంటి సమస్యలతో బాధపడేవారు అధికంగా ఉంటారు. అయితే క్యారెట్ తినడం వల్ల కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్లోని బీటా కెరోటిన్ కార్నియా సమస్యను దూరం చేస్తుందని పేర్కొంటున్నారు. అలాగే క్యారెట్లో ఉండే కెరోటినాయిడ్స్ కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారిస్తుందని వివరిస్తున్నారు.