భూ సమస్యల పరిష్కారమే టీడీపీ కూటమి ప్రభుత్వం లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం కల్లూరు ఊరివాకిలి వద్ద నోడల్ ఆపీసర్ నాగసుధ, తహసీల్దారు కె.ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న భూహక్కు భూరక్ష రీసర్వే తప్పుల తడకగా ఉందని, ప్రజల ఆస్తికి రక్షణ కొరవ డిందని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రజల రక్షణ కోసం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారని గుర్తుచేశారు. భూసమస్యలను రెవెన్యూ అధికారులు 45 రోజుల్లో పరిస్కరిస్తారని అన్నారు. కల్లూరు రెవెన్యూ గ్రామసభకు వక్ఫ్‌బోర్డ్, ఎండోమెంట్ అధికారులు రావాలని క్షేత్రస్థాయిలో ఆ సమస్యలే అధికంగా ఉన్నాయని ఎమ్మెల్యే కొంత అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. అందులో క్లాసిపికేషనకు-5, ఆనలైనలో పేరు నమోదు-15 వచ్చాయని రెవెన్యూ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎన్వీ.రామకృష్ణ, పాణ్యం ముస్లిం మైనార్టీ అఽధ్యక్షుడు ఎస్.ఫిరోజ్, రైతు సంఘం అధ్యక్షుడు సంపతి లక్ష్మీరెడ్డి, పవనకుమార్, గోపి, మండల సర్వేయర్ శ్రీనివాసులు, వీఆర్వోలు మహేశ్వరరెడ్డి, ఖాదర్‌బాషా పాల్గొన్నారు.