కర్నూలును స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ పి.రంజిత బాషా కర్నూలు మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స హాల్లో పుచ్చకాయలమడ గ్రామంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలకు సంబంధించి పురోగతిలో ఉన్న పనులు డిసెంబరు ఆఖరు నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. జల్ జీవన మిషనలో భాగంగా 135 కుళాయి కనెక్షన్లకు గానూ 130 పూర్త య్యాయని, పురోగతిలో ఉన్న 5 కొళాయి కనెక్షన్లు త్వరిగతిన పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారిని ఆదేశించారు. పంచాయతీరాజ్‌కి సంబంధించిన 16 ఇంటర్నల్ సీసీ రోడ్ల నిర్మాణానికి గానూ 11 పూర్తి చేశారని, పెండింగ్‌లో ఉన్న 55 సీసీ రోడ్ల నిర్మాణాలు, పురోగతిలో ఉన్న హైస్కూల్ ప్రహరీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఎస్‌ఈని ఆదేశించారు. 22 మినీ గోకులాలు, 10 ఫారంఫాండ్స్, 6 బౌండరీ ట్రెంచెస్, 6 పీడర్ చానల్స్ పనులను పూర్తి చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రామచం ద్రారెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణయ్య, డీఆర్‌డీఏ పీడీ నాగ శివలీల, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఉమాపతి పాల్గొన్నారు.