విశాఖ ఆర్కే బీచ్‌రోడ్డులో ‘యుహెచ్-3హెచ్’ హెలికాప్టర్ మ్యూజియం పనులు జనవరి నెలాఖరుకు పూర్తవుతాయని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్‌తో కలిసి ఆయన మ్యూజియం పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ పర్యాటక రంగానికి ఈ హెలికాప్టర్ మ్యూజియం మరో అదనపు ఆకర్షణగా నిలుస్తుందన్నారు. పనులు వేగంగానే జరుగుతున్నాయని, ఎక్కడా రాజీ పడవద్దని ఇంజనీరింగ్ అధికారులకు సూచించామన్నారు. ఆ తరువాత సిరిపురం జంక్షన్‌లోని మల్టీ లెవెల్ కారు పార్కింగ్ భవన నిర్మాణాన్ని కూడా ఇద్దరూ పరిశీలించారు. దీనిని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి రెండింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ప్రారంభింపజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ బలరామరాజు, ఈఈలు సుధీర్, దుర్గాప్రసాద్, ఏఈ కార్తీక తదితరులు పాల్గొన్నారు.