విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బందపు ఈశ్వరప్రసాద్ గరివిడి మండలంలోని కాపుశంభాం జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే.
అంత్యక్రియలను మంగళవారం ఆయన స్వస్థలం భీమవరంలో అధికార లాంఛనాలతో జరిగాయి. జవాన్ ఈశ్వరప్రసాద్ భార్య వినూత్న తలకు, కాలికి గాయాల కావడంతో ఆమె ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది.