కడప కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో 49వ డివిజన్లలో ఒక్కటే టీడీపీ గెలుచుకుంది. మిగిలిన అన్ని డివిజన్లలో వైసీపీ పాగ వేసింది. కానీ ఫ్యాన్ పార్టీకి రాష్ట్ర పీఠం చేజారాక ఎదురు గాలి మొదలైంది.
జగన్ సొంత గడ్డ కడపలోనే వైసీపీకి కార్పొరేటర్లు షాకిస్తున్నారు. 8 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అవ్వడంతో కూటమి బలం ఇప్పుడు 9కి చేరింది. ఇంకొద్ది రోజుల్లో 10 మంది కార్పొరేటర్లు సైకల్ ఎక్కేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.