విద్యుతను పొదుపు చేసి భావితరాలకు భరోసా కల్పిద్దామని,ఎంఈవో త్యాగరాజు పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఏఈ శేషుకుమార్ ఆదేశాల మేరకు మంగళవారం తంబళ్లపల్లె స్థానిక ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, కేజీబీవీ లలో విద్యుత పొదుపుపై అవగా హన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన ప్రాముఖ్యతతో పాటు విద్యుతను ఏ విధంగా పొదుపు చేయాలి అనే విషయాలను విద్యార్థులకు వివరించారు. ఎంఈవో మాట్లాడుతూ..... విద్యుత పొదుపుపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒక యూనిట్ విద్యుత ఆదా చేయడం వల్ల రెండు యూనిట్లు ఉత్పత్తి భారం తగ్గుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అవసరం లేని సమయంలో స్విచలు ఆఫ్ చేసి విద్యుతను ఆదా చేయాలన్నారు. కార్యక్రమంలో లైనఇనస్పెక్టర్లు భాస్కర్, నాగరాజు లైనమెన్లు శంకర, నాగేంద్ర, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.