నగర పాలక సంస్థలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 156.93 కోట్లతో అధికారులు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ను పాలకవర్గం ఆమోదించింది. మంగళవారం విజయనగరం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు.
రూ. 156.93 కోట్లతో వార్షిక బడ్జెట్ ను కమిషనర్ నల్లనయ్య సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై పలువురు కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను తెలిపిన అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.