చాలామంది దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మూత్రం లీక్ అవుతుంది. బాగా దగ్గినా తుమ్మినా లేదా బరువులను ఎత్తడం వంటి పనులు చేసినా లేదా మరేదైనా ఇతర ఒత్తిడి ఉన్న మన శరీరంలో కటి ప్రాంతంలో ఉన్న కండరాలు బలహీనపడటం వల్ల మూత్రం పడుతుంది. ఇది చాలా మంది ఆడవాళ్ళలో జరుగుతుంది.ఒక్కోసారి బయట ఉద్యోగాలు చేసేవారు ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతున్నారు. డైపర్స్ వేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దగ్గినా, తుమ్మినా మూత్రం.. కారణాలు ఇవే ఇక ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మనం ఏం చేయవచ్చు? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. మహిళలు సాధారణంగా పిల్లలకు జన్మనిస్తారు. ప్రసవ సమయంలో మన శరీరంలోని కటి భాగం (పెల్విక్) దెబ్బ తినడం వల్ల, మన పొట్ట పైన ఒత్తిడి పెరగడం వలన, ఊబకాయం సమస్యలతో ఉన్నవారికి, గర్భసంచి తొలగించిన మహిళలకు, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు బాగా బరువులు మోసినప్పుడు మూత్రం పడుతుంది. ఎంత కంట్రోల్ చేసినా ఆగని మూత్ర విసర్జన .. ఎందుకంటే అంతేకాదు నాడీ సంబంధితమైన పరిస్థితుల కారణంగా, మెదడు మరియు వెన్నుపామును ప్రభావితం చేసే పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు, లేదా మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కొన్ని రకాల మందుల కారణంగా కూడా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మూత్రం ఎంత కంట్రోల్ చేసినా ఆగకుండా పడిపోతుంది. దగ్గినా, తుమ్మినా మూత్రం పడితే ఈ పని చెయ్యాలి ఇక పురుషులలో కూడా ప్రొస్టేట్ గ్రంధిని తొలగించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లే ఈ సమస్యతో ఎక్కువగా బాధపడతారు. అయితే ఈ యూరో గైనకాలజీ సమస్య విషయంలో మహిళలు నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ముఖ్యంగా మహిళలు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పనులు చేసినా సమస్య కంట్రోల్కె ఫిన్ వంటి వాటి వినియోగం తగ్గించడం, బరువు తగ్గడం, ప్రతిరోజు ఎంత లిక్విడ్స్ తీసుకుంటున్నారు అనేది గమనించుకోవడం వంటివి చేయాలి. పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. ఇక అప్పటికి కూడా కంట్రోల్ చేయలేని మూత్ర విసర్జన జరిగితే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం మంచిది కాదు.. చికిత్స అవసరం ఇదేదో చిన్న సమస్యనే అని నిర్లక్ష్యంగా వదిలేస్తే సమస్య మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఊహించని విధంగా మనం ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఏదైనా బరువులు మోసినప్పుడు మూత్ర విసర్జన జరిగితే ఇది సహజమేనని వదిలేయకండి. తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.