రోజూ బ్రౌర్ రైస్ తింటే ఆసుపత్రికి వెళ్లాల్సిన పని ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. బ్రౌర్ రైస్ (దంపుడు బియ్యం) తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో దాదాపు 21 శాతం మెగ్నీషియం లభిస్తుందని, అలాగే అందులో ఉండే పీచు పదార్థం జీర్ణవాహికలో క్యాన్సర్ రసాయనాలను బయటకు పంపుతుందని సూచిస్తున్నారు. ఉబ్బసం తీవ్రతను కూడా బ్రౌన్ రైస్ తగ్గిస్తుందని వివరిస్తున్నారు.