ఉప్పల్ డివిజవ్ నాచారం లోని అయ్యప్ప స్వామి ఆలయంలో వైభవం గా అయ్యప్ప పూజ నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ సాయి జెన్ శేఖర్, దేవాలయ ధర్మకర్త బండ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
శుక్రవారం శ్రీ అయ్యప్ప స్వామివారి మహాపడి పూజ నాచారం లొ అంగరంగ వైభవముగా జరిగింది. గణపతి పూజ , సుబ్రమణ్యస్వామి పూజ, అనంతరము అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతముతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు.
భారీ ఎత్తున పాల్గొన్న అయ్యప్పలు,భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప నామస్మరణలో మునిగిపోయారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన గురుస్వాములు అయ్యప్ప స్వాములచే కర్పూర హారతులను అందిచారు. భజన బృదంతో పాటలు పాడుతూ భక్తులను మైమరిపించారు స్వామివారి నామస్మరణ తో నాచారం ప్రాంతము మార్మోగింది. అనంతరం గురుస్వామి ఘన్నోజు భాస్కర చారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రములో పలువురు స్వాములు పాల్గొన్నారు.